ప్రస్తుత కాలంలో పర్యావరణానికి సంబంధించిన ఏ వార్త వచ్చినా మనకు బ్యాడ్ న్యూస్‌గానే ఉండేది. కారణం పర్యావరణ కాలుష్యం పెరగడం, గాలి, నీరు, భూమి కలుషితం కావడంతో వాటివల్లే వచ్చే రోగాల వల్ల ఎంతో మంది మరణిస్తున్నారు.
మనదేశంలోని మెట్రోపాలిటన్ సిటీ, ఢిల్లీ, ముంబాయి, కలకత్తా, మద్రాస్, హైదరాబాద్ నగరాలలో Air pollution వాయుకాలుష్యం ఎంతో అధికం.
నేడు ప్లాస్టిక్ Plastic వాడకం పెరిగే కొద్ది, భూమిపై, సముద్రంలో కాలుష్యం శాతం పెరిగిపోతుంది. జంతు, జీవనాదుకు నష్టమే కాకుండా, ఆకాశంలోని Ozone ఓజోన్ పోరకు కూడా మెల్లిగా చిల్లుపడి మానవ మనుగడే ప్రశ్నార్ధకమయ్యే పరిస్థితి వస్తుంది
అసలు ముందుగా ఓజోన్ పొర అంటే ఏమిటి? What is Ozone Layer?
మనం భూమిని అంతరిక్షం నుండి చూస్తే ఎంతో అందంగా కనిపిస్తుంది. మన భూమిపై ఉన్న వాతావరణం బట్టి భూమిని ఐదు భాగాలుగా విభజించవచ్చు. 1) ట్రోపోస్పియర్, 2) స్టాత్రోస్పియర్3) ఐనోస్పియర్, 4) థర్మోస్పియర్ 5) ఎక్సోస్పియర్. ఈ ఓజోన్ పొర స్టాత్రోస్పియర్‌లో ఉంటుంది. సూర్యుని నుండి వచ్చే అతినిల లోహిత కిరణాల నుండి భూమిపై ఉన్న జీవ జంతులాన్ని స్టాత్రోస్పియర్ కాపాడుతుంది. అయితే సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాలు మొక్కలపై నేరుగా పడినట్లయితే హరితరేణువులు చనిపోతాయి. దీంతో మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ జరుగక, ఆహారం అందక మొక్కలు చనిపోతాయి. అంటే మానవునికి తిండి పెట్టే మొక్కలు నష్టపోతే...మానవుని మనుగడే కష్టం.
అంతేగాక ఈ అతినీల లోహిత కిరణాలు మానవులపై, జంతువులపైగాని నేరుగా పడినట్లయితే చర్మ సంబంధిత క్యాన్సర్ Cancer రోగాలు వచ్చే ఆస్కారం ఉంది. కాబ్టి ఈ ప్రమాదకర అతినీలరోహిత కిరణాల నుండి మనకు ఓజోన్ పోర కాపాడుతుంది.
19 వ శతాబ్దం నుండి పారిశ్రామిక విప్లవంతో అనేక రకాల ఫ్యాక్టరీలు వెలిశాయి. దీంతో వాటి వ్యర్ధాలు గాలి, నీరులో కలవడంతో ఓజోన్‌పొర మెల్లమెల్లిగా కరగడం మొదలయింది. ఈ జోన్‌పొరకు నష్టం చేకూర్చడంలో మనపాత్ర కూడా ఉంది. మనం వాడే స్ప్రేలు, ఏ/సి, రిఫ్రిజిరేటర్‌లు, కొన్ని రకాల ఫ్యాక్టరీలు CFC ని వదలడంతో నష్టం పెరుగుతుంది.
కాబట్టి ఫ్రెండ్స్.....మనం ఓజోన్ పొరకు నష్టం చేకూర్చే వాటి నుండి దూరంగా ఉండడమే మంచిది. మన అనారోగ్యానికి మనమే కారకులుగా మారకుండా ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాలి.
No comments:
Post a Comment